వికాస్‌ ముందంజ... హుసాముద్దీన్‌ ఓటమి

Asian Games: Boxer Vikas Krishan storms into quarters - Sakshi

ఏషియాడ్‌ బాక్సింగ్‌లో ముగ్గురు భారత బాక్సర్లు వికాస్‌ కృషన్‌ (75 కేజీలు), అమిత్‌ (49 కేజీలు), ధీరజ్‌ (64 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరారు. అయితే, కామన్వెల్త్‌ క్రీడల కాంస్య పతక విజేత, నిజామాబాద్‌ కుర్రాడు మొహమ్మద్‌ హుసాముద్దీన్‌ (56 కేజీలు) ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యాడు.

హుసాముద్దీన్‌ 2–3తో కిర్గిస్తాన్‌కు చెందిన ఎంక్‌ అమర్‌ ఖర్‌ఖు చేతిలో ఓడిపోయాడు. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో హుసాముద్దీన్‌ నుదురుకు గాయమైంది. వికాస్‌ పదునైన పంచ్‌లతో 5–0తో తన్వీర్‌ అహ్మద్‌ (పాకిస్తాన్‌)పై... అమిత్‌ 5–0తో ఎన్ఖమన్‌దఖ్‌ ఖర్‌హు (మంగోలియా)పై... ధీరజ్‌ (64 కేజీలు) 3–0తో నుర్లాన్‌ కొబషెవ్‌ (మంగోలియా)పై గెలుపొందారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top