వెలగపూడి.. మర్యాదగా మట్లాడు..

YSRCP Leader Prasad Fire on Velagapudi Ramakrishna Visakhapatnam - Sakshi

జననేత జగన్‌ను లేనిపోని మాటలు అంటావా?

జనం తరిమి కొడతారు జాగ్రత్త

వైఎస్సార్‌సీపీ నేత కొయ్య ప్రసాదరెడ్డి ధ్వజం

విశాఖ ఉత్తర: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తమ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయవాడలో  వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయివన్న సంగతి వెలగపూడి మరిచిపోవద్దని సూచించారు. భూకబ్జాలు, తోపుడు బళ్లు నడుపుతున్న వారి వద్ద కలెక్షన్లు చేసిన ఘనుడవని ధ్వజమెత్తారు. వెలగపూడి లాంటి రౌడీషీటర్లకు చంద్రబాబు టిక్కెట్లు ఇచ్చి రాజకీయాలను భ్రష్టుపట్టించారని ఆరోపించరాఉ.

దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, బుచ్చయ్య చైదరి, చింతమనేని ప్రభాకర్‌ లాంటి వ్యక్తిత్వంలేని వారు ఉండడం వల్ల టీడీపీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందన్నారు. ఒక పార్టీలో పోటీ చేసి, వేరే పార్టీతో లాలూచీ పడి దొడ్డి దారిన గెలిచిన దొంగవు నీవు అంటూ ప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత విశాఖ నగరానికి కోడి పందేలు, డ్రగ్స్, జూదంతో అపఖ్యాతి మూటగట్టావని ఆరోపించారు. వందల కోట్ల రూపాయలు సంపాదించిన అహంకారంతో వెలగపూడి మాట్లాడుతున్నాడని.. విశాఖలో పుట్టి సంస్కారం ఉన్న వాళ్లం కాబట్టి గౌరవంగా ఉన్నామని చెప్పారు. రాబోయే రోజులో టీడీపీ దుకాణం బంద్‌ చేయడం ఖాయమన్నారు. దేశ చరిత్రలో ఓ యువనేతకు ప్రజలు పట్టాభిషేకం చేయడం పట్ల ఓర్వలేక జగన్‌పై మాట్లాడడం బాధాకరమన్నారు. వెలగపూడి లాంటి చీడపురుగులు వల్ల టీడీపీ పతనం ఖాయమని కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఇప్పటికైనా దిగుజారుడు మాటలు మాని విశాఖ ప్రతిష్టని మంటగలపు వద్దని హితవు పలికారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top