టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు నాయకుల షాక్‌..!

TRS Choppadandi Leaders Meet KCR Against Bodige Sobha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఓవైపు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ముందుస్తు ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం జోరుగా సాగుతుండగా.. మరోవైపు ఆ పార్టీ చొప్పదండి నియోజకవర్గం నాయకుల మధ్య వివాదం రాజుకొంది. ఎమ్మెల్యే బొడిగే శోభకు వ్యతిరేకంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌ వద్ద గళం విప్పారు. ఎమ్మెల్యే పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయడం లేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బొడిగె శోభకు టికెట్‌ ఇవ్వొద్దని వారు కేసీఆర్‌ను కోరారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top