‘మెడికల్‌ అడ్మిషన్లలో సామాజికన్యాయమేదీ’

Tammineni veerabadram on Medical Admissions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెడికల్, ఇంజనీరింగ్‌ తదితర వృత్తివిద్యా కోర్సుల్లో చట్టబద్ధమైన రిజర్వేషన్లు అమలుచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. సామాజికవర్గాల వారీగా రిజర్వేషన్లను అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు గురువారం ఆయన లేఖ రాశారు. వృత్తి విద్యాకోర్సుల్లో రిజర్వేషన్లను అమలుచేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన జీవో 550 అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు.

దీనివల్ల మెరిట్‌ ఆధారంగా ఓపెన్‌ కోటాలో సీట్లు పొందగలిగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఆ అవకాశాన్ని కోల్పోతున్నారన్నారు. ఓపెన్‌ కేటగిరిలో పోటీపడే సామర్థ్యమున్న విద్యార్థులకూ రిజర్వేషన్‌ కోటాలోనే సీట్లు ఇస్తున్నారని, ఈ అన్యాయాన్ని సరిదిద్దడంలో ప్రభుత్వం తగిన శ్రద్ధను చూపడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా సామాజికన్యాయాన్ని పరిరక్షించే విధంగా సుప్రీంకోర్టులో వాదనలు చేయాలని తమ్మినేని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top