ఇంటర్‌ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలి | Revanth Reddy Demanded Government Take Action On Telangana Intermediate Board Officials | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలి : రేవంత్‌

Apr 22 2019 2:05 PM | Updated on Apr 22 2019 2:09 PM

Revanth Reddy Demanded Government Take Action On Telangana Intermediate Board Officials - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాలు చేసినందుకుగాను బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. విద్యార్థులందరికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ ఫలితాల తప్పిదాలపై సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. రీ కౌంటింగ్‌, రీ వాల్యూవేషన్‌కు కూడా అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఫలితాల తప్పిదాలనకు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement