నిషేధాజ్ఞలను ఉల్లంఘించి సాధ్వి ప్రచారం! | EC Issues Another Notice to Pragya Thakur | Sakshi
Sakshi News home page

నిషేధాజ్ఞలను ఉల్లంఘించి సాధ్వి ప్రచారం!

May 5 2019 12:54 PM | Updated on May 5 2019 3:16 PM

EC Issues Another Notice to Pragya Thakur - Sakshi

న్యూఢిల్లీ : భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కి ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. 72 గంటల నిషేధాజ్ఞలను జవదాటి ప్రచారం నిర్వహించినందుకు ప్రజ్ఞాసింగ్‌ని ఈసీ వివరణ కోరింది. బాబ్రీ మసీదుకు సంబంధించి మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు... 72గంటలపాటు ప్రచారం చేయకుండా సాధ్విపై ఈసీ నిషేధం విధించింది. గురువారం ఉదయం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అయితే శుక్రవారం ప్రజ్ఞాసింగ్‌ ఓ ఆలయాన్ని సందర్శించి అక్కడ భక్తులతో ముచ్చటించారు. దీనిపై ఫిర్యాదు అందడంతో ఈసీ ప్రజ్ఞాసింగ్‌కి నోటీసులు పంపింది. దీనిపై స్పందించిన సాధ్వి.. ఆలయాల సందర్శన సన్యాసి జీవితంలో భాగమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement