ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం సతీమణి, కుమార్తె

Arvind Kejriwal Wife And Daughter Campaign In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక వ్యూహాలతో ఎన్నికల రంగంలో బిజీబిజీగా ఉన్నాయి. రెండోసారి విజయం సాధించాలని ఆప్‌ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. దీనిలో భాగంగానే శనివారం కేజ్రీవాల్‌ భార్య సునీత, అతని కుమార్తె హర్షిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓట్ల కోసం ఢిల్లీ వీధుల్లో ఇద్దరూ చమటోడుస్తున్నారు. తన తండ్రికి ఓటు వేసి మరోసారి గెలిపించాలని హర్షిత ఓటర్లును కోరుతున్నారు. అయితే భార్య, బిడ్డల కష్టం ఏమేరకు ఫలిస్తుందనేది ఫలితాల అనంతరం తేలనుంది. (త్రిముఖ పోరులో పీఠం ఎవరిది..?)

దేశ రాజధాని కావడంతో ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలైన ఆప్‌, బీజేపీ, కాంగ్రెస్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా హస్తినలో అధికారానికి దూరంగా ఉన్న.. కమళనాధులు విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చూస్తున్నారు. ఇక గత వైభవం కోసం హస్తం పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. (ఢిల్లీని ఊపేస్తున్న.. ‘లగే రహో కేజ్రీవాల్‌’)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top