రాంగ్ రూట్‌ను అడ్డుకున్నందుకు దాడి చేశాడు

Wrong Route Biker Attacked in Bhopal - Sakshi

భోపాల్‌ : రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనదారులకు బుద్ధి చెప్పేలా ఓ వ్యక్తి చేసిన పనిపై పలువురు అభినందనలు కురిస్తున్నారు. అయితే తప్పును ఎత్తి చూపే క్రమంలో ధైర్యంగా నిలబడిన యువకుడు దాడికి గురికావటం.. చుట్టుపక్కల వెళ్లేవారు కాసేపటి దాకా వారిని అడ్డుకునే యత్నం చేయకపోవటం ఇక్కడ గమనార్హం. 

నవంబర్ 3న ఈ ఘటన భోపాల్‌లోని ఓ సిగ్నల్‌ వద్ద చోటు చేసుకుంది. ఓ ఎస్‌యూవీ వాహనం రాంగ్ రూట్‌లో రావటం గమనించిన ఓ యువకుడు తన బైక్‌ను అడ్డుగా నిలిపాడు. చాలా సేపు వారిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే బైక్‌ పై ఉన్న వ్యక్తి మాత్రం అస్సలు చలించలేదు. చివరకు ఎస్‌యూవీతో ఢీకొట్టేందుకు ఝలక్‌ ఇవ్వగా.. యువకుడు అస్సలు బెదరలేదు. చివరకు తన ఫోన్‌తో నెంబర్‌ ఫ్లేట్ ఫోటోలు తీశాడు. అది గమనించిన ఎస్‌యూవీ వాహనదారుడు కూడా అదే పని చేయగా.. చివరకు ఆ వాదులాట తన్నులాటకు దారితీసింది. 

బైక్‌పై ఉన్న వ్యక్తిపై ఎస్‌యూవీ డ్రైవర్‌ నిర్దాక్షిణ్యంగా పిడిగుద్దులు కురిపించాడు. ఆఖర్లో కొందరు వచ్చి వారిని విడిపించారు. ఈ ఘటనపై పోలీస్‌ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.  ఇండోర్‌కు చెందిన నిలయ వర్మ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌లో ఆ సీసీటీవీ ఫుటేజీని.. కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ కాపీని పోస్టు చేశారు. బైక్‌పై ఉన్న యువకుడికి హాట్సాఫ్.. తప్పును ధైర్యంగా ప్రశ్నించే ఇలాంటోళ్లు ఉండాల్సిందే అంటూ ఆయన అభినందనలు కురిపించారు. ఆ వీడియోను ఇప్పటికే 5 మిలియన్లకుపైగా వీక్షించారు.

రాంగ్ రూట్‌ను అడ్డుకున్నాడని దాడి చేశాడు 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top