మరాఠా నిరసనల కేసులో ముగ్గురి అరెస్ట్‌

Three Held By Maharashtra ATS Planned Violent Maratha Protests - Sakshi

సాక్షి, ముంబై : మరాఠాల ఆందోళనలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన అతివాద హిందూ సంస్థలకు చెందిన ముగ్గురిని అరెస్ట్‌ చేశామని మహారాష్ట్ర ఏటీఎస్‌ వెల్లడించింది. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కోరుతూ మరాఠాలు చేపట్టిన నిరసనల్లో ప్రభుత్వానికి గట్టి సంకేతాలు పంపే ఉద్దేశంతో నిందితులు బాంబులు అమర్చారని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. మరాఠా మోర్చా వద్ద 100 నుంచి 150 మీటర్ల దూరంలో బాంబులు పేల్చేందుకు నిందితులు ప్రణాళిక రూపొందించారని, ఆగస్ట్‌ 9న పేలుడు పదార్ధాలతో వీరు నలసపోరా, సతారా ప్రాంతాల్లో పట్టుబడ్డారని ఏటీఎస్‌ అధికారులు వెల్లడించారు. మరాఠాల డిమాండ్‌కు అనుకూలంగా ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు పంపేందుకే నిందితులు ఈ స్కెచ్‌ వేశారని చెప్పారు.

ముంబై, పూణే, సతార, షోలాపూర్‌, నలసపోరా ప్రాంతాల్లోనూ దాడులకు వీరు ప్రణాళికలు రూపొందించారన్నారు. మరాఠా మోర్చాలే లక్ష్యంగా ప్రాణనష్టం లేకుండా గందరగోళం సృష్టించేందుకే ఈ తరహా దాడులకు వీరు ప్లాన్‌ చేశారని చెప్పారు. క్రూడ్‌ బాంబులు విసిరి భయోత్పాతం సృష్టించాలని తాము ప్రణాళిక రూపొందించామని నిందితులు విచారణలో వెల్లడించారని ఏటీఎస్‌ వర్గాలు తెలిపాయి. కాగా నిందితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని సనాతన్‌ సంస్థ పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top