మేక పాలతో సబ్బుల తయారీ! | Soap Manufacturing With Help Of Goat Milk At Osmanabad | Sakshi
Sakshi News home page

మేక పాలతో సబ్బుల తయారీ!

Nov 20 2019 4:19 AM | Updated on Nov 20 2019 4:19 AM

Soap Manufacturing With Help Of Goat Milk At Osmanabad - Sakshi

ఔరంగాబాద్‌: అత్యంత కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లా రైతులకు ఇప్పుడు ‘ఉస్మానాబాదీ మేక’ ఆదాయ వనరుగా మారింది. ఈ ప్రాంతంలోని దాదాపు 250 కుటుంబాలు మేక పాలతో సబ్బులను తయారుచేసి జీవనోపాధి పొందుతున్నారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఈ జిల్లాలోని 25 గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలు సబ్బులను తయారు చేస్తున్నారు. విటమిన్‌ ఏ, ఈలు, సెలీనియం, ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్న ఈ మేక పాలు.. చర్మ వ్యాధులను నయం చేస్తాయని శివార్‌ అనే స్వచ్ఛంద సంస్థ సీఈవో వినాయక్‌ హెగనా తెలిపారు. ఒక లీటరు ఉస్మానాబాదీ మేక పాలకు తాము రూ.300 చెల్లిస్తామని, ప్రతిరోజు పని చేసినందుకు గాను వారు రూ.150 సంపాదిస్తారని ఆయన పేర్కొన్నారు. 1,400 మేకల ద్వారా కనీసం 250 కుటుంబాలు ఈ వ్యాపారాన్ని చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement