స్పైస్‌జెట్‌ సిబ్బంది దురుసు ప్రవర్తన; ప్రగ్యా ఫిర్యాదు

Pragya Thakur Gave Complaint Because Refused To Give Seat In Spice Jet - Sakshi

భోపాల్‌ : బీజేపీ నేత, భోపాల్‌ ఎంపీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్ స్పైస్‌జెట్‌ విమానంలో సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని సంస్ధ డైరక్టర్‌కు ఆదివారం భోపాల్‌ విమానాశ్రయంలో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రగ్యా సింగ్‌ ఠాకూర్ ఢిల్లీ నుంచి భోపాల్‌ వెళ్తున్నస్పైస్‌జెట్‌ విమానం ఎక్కారు. అయితే విమాన సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. తాను బుక్‌ చేసుకున్న సీటుని తనకు కేటాయించలేదని విమానాశ్రయ డైరక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు తనకు సీటు ఇవ్వలేదన్న కోపంతో విమానం ల్యాండిండ్‌ అవుతున్న సమయంలో నిరసనకు దిగినట్లు మాకు సమాచారం అందింది.

దీంతో డైరక్టర్‌ అనిల్‌ విక్రమ్‌ రంగంలోకి దిగి ప్రగ్యాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.'ప్రగ్యా ఠాకూర్ ఇచ్చిన ఫిర్యాదును  స్వీకరించాం. దీనిపై సిబ్బందిని వివరణ అడిగి చర్యలు తీసుకుంటామని ' అనిల్‌ విక్రమ్‌ తెలిపారు. 'ప్రగ్యా ఠాకూర్ వీల్‌చైర్‌తోనే విమానాన్ని ఎక్కారు. భద్రతా కారణాల రిత్యా వీల్‌చైర్‌ను అనుమతించబోమని తెలిపాం. అందుకే ఆమెకు కేటాయించిన సీటులో ఆమెను కూర్చోవడానికి నిరాకరించాం. దీంతో ఆమె విమానంలోనే నిరసనకు దిగారని' అని సిబ్బంది వాపోయారు. అయితే ఈ కేసును సోమవారం పరిశీలించనున్నట్లు అనిల్‌ విక్రమ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.(చదవండి :‘మనోభావాలు దెబ్బతింటే మన్నించండి’)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top