రాహుల్ ఆచూకీ తెలిపిన వారికి బంపర్ ఆఫర్ | MP BJP Leader Announces Rs 1 Lakh Reward for 'Locating' Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్ ఆచూకీ తెలిపిన వారికి బంపర్ ఆఫర్

Jun 23 2016 8:53 PM | Updated on Mar 29 2019 8:30 PM

రాహుల్ ఆచూకీ తెలిపిన వారికి బంపర్ ఆఫర్ - Sakshi

రాహుల్ ఆచూకీ తెలిపిన వారికి బంపర్ ఆఫర్

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై విమర్శల దుమారం చెలరేగుతోంది. రాహుల్ గాంధీ ఆచూకీ తెలిపినవారికి కాంగ్రెస్ వారితో సహా ఎవరికైనా ఒక రూ. లక్ష ను ఇస్తానని బీజేపీ ఎంపీ ప్రకటించారు.

భోపాల్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై విమర్శల దుమారం చెలరేగుతోంది. రాహుల్ గాంధీ ఆచూకీ తెలిపినవారికి కాంగ్రెస్ వారితో సహా ఎవరికైనా ఒక రూ. లక్ష ను ఇస్తానని బీజేపీ ఎంపీ, మధ్యప్రదేశ్  అధికార ప్రతినిధి  విజేంద్ర సింగ్ సిసోడియా ప్రకటించారు. రాహుల్ గాంధీకా పతా బతావో ఎక్ లాక్ రూప్యా పావో( రాహుల్ గాంధీ అచూకీ తెలపండి, లక్ష గెలుపొందండి) అని ప్రకటించారు.

గతేడాది రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లినపుడు ఆయన ఎనర్జీని పొందడానికి, పార్టీ బలోపేతం కోసం మేదో మథనం చేసేందుకు వెళ్లారని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని అన్నారు. కానీ రాహుల్ మాత్రం మలేషియా, బ్యాంకాక్,సింగపూర్ లలో విహరించారని సిసోడియా తెలిపారు. ఇప్పుడు రాహుల్ ఎనర్జీ లెవల్స్ మళ్లీ తగ్గాయా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ ఏ దేశానికి వెళ్లారు? ఎవరిని కలుస్తారు? ఎలా రీచార్జ్ అవుతారు?  అని సిసోడియా ఎద్దేవా చేశారు.  దీనిపై స్పందించిన కాంగ్రెస్ బీజేపీకి రాహుల్ ఫోబియా పట్టుకుందని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవి సక్సేనా అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement