విద్యుత్ వైర్లు తెగిపడి..ఆరుగురి మృతి | High tension wire electrocutes six of a family died in bihar | Sakshi
Sakshi News home page

విద్యుత్ వైర్లు తెగిపడి..ఆరుగురి మృతి

May 5 2016 9:40 AM | Updated on Nov 6 2018 4:37 PM

విద్యుత్ వైర్లు తెగిపడి..ఆరుగురి మృతి - Sakshi

విద్యుత్ వైర్లు తెగిపడి..ఆరుగురి మృతి

బిహార్లో విషాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఓ ఇంటిపై తెగిపడిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు.

బిహార్: బిహార్లో విషాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఓ ఇంటిపై తెగిపడిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు.

ముజాఫర్పూర్లోని బెనిబాద్ గ్రామంలో ఇంటిలో నిద్రిస్తున్న వారిపై విద్యుత్ వైర్లు తెగిపడడంతో ఆరుగురు కుటుంబసభ్యులు అక్కడిక్కడే మృతిచెందారు. బిహార్లో గత 24 గంటల్లో కురుస్తున్న వడగళ్ళ వర్షాల కారణంగా ముజాఫర్పూర్, ధర్భంగ, నవాడ ప్రాంతాల్లో తొమ్మిది మంది మరణించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ గాలులు వీస్తుండడంతో విద్యుత్ స్తంభాలు నేలకూరడంతో పాటు మామిడి, పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement