మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్, వీడియో తీసి..

Gang rape on minor in Bhihar - Sakshi

పట్నా : ఆరుగురు యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. బిహార్ లో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా రేప్ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. జనవరి 31 న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా మంగళవారం రాత్రి వెలుగు చూసింది. ఈ సంఘటన బోజ్ పుర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, రేప్ దృశ్యాలను మొబైల్ లో రికార్డు కూడా చేశారు. అక్కడితో ఆగకుండా వాట్సాప్ గ్రూప్ లలో షేర్‌ చేశారు. గ్యాంగ్ రేప్ వీడియో వైరల్ అవ్వడంతో ఈ విషయం బాధితురాలి తండ్రికి తెలిసింది. బాధితురాలి తండ్రి పాట్నాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరా మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఆరుగురు యువకులు తన కూతురిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురు బర్హరా పోలీస్ స్టేషన్ సమీపంలో బహిర్భూమికి వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికని వైద్యపరీక్షల కోసం సదర్ ఆసుపత్రికి తరలించినట్టు అరా మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ పూనమ్ కుమారి చెప్పారు. నిందితుల్లో ఒకడైన క్రిష్ణా యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు, మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పూనమ్ తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top