రైతు, చిరుతల మధ్య పోరాటం: చిరుత హతం

fight between farmer and tiger - Sakshi

దూరం నుంచి జూలో పులిని చూడాలంటేనే మనకు చాలా భయం. అది గాండ్రించింది అంటే ఒక్కసారిగా వణుకుపుడుతుంది. అలాంటిది ఓ రైతు పెద్ద సాహసమే చేశాడు. ఓ రైతు, చిరుతల మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. ఆ భీకర యుద్ధంలో చిరుత పులి ఓడిపోయింది. 

క్రిష్ణగిరి జిల్లా మహారాజగడ సమీపంలోని మేలుపల్లి గ్రామానికి చెందిన రామమూర్తి(62). పశువులను పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం పశువులను మేపడానికి అటవీ ప్రాంతానికి   వెళ్లిన సమయంలో  ఓ చిరుత రామమూర్తిపై దాడి చేసింది. దీంతో ఆయన ఏమాత్రం వెనుదిరగకుండా ఎదురుదాడికి దిగి,  ధైర్యంగా ఎదుర్కొని తన చేతిలో ఉన్న వేటకొడవలితో దాడి చేసి చిరుతను చంపాడు. స్వల్ప గాయాలైన రామమూర్తిని స్థానికులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు రామమూర్తిని విచారణ జరపారు. తన ప్రాణాలను కాపాడుకోవడాకి చిరుతపై దాడి చేయవలసి వచ్చిందని అధికారులతో తెలిపాడు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top