గూగులమ్మా..జవాబు చెప్పమ్మా!

Do you know what the highest Indians searched this year by Google - Sakshi

గూగుల్‌ ద్వారా ఈ ఏడాది అత్యధిక భారతీయులు సెర్చ్‌ చేసిందేమిటో తెలుసా?

వాట్సాప్‌లో స్టిక్కర్లను ఎలా పంపాలి? 

సెక్షన్‌ 377 అంటే ఏమిటి? 

సందేహం ఏదైనా.. ఎలాంటిదైనా.. గూగులమ్మ గూటి ముందు వాలడానికి అలవాటు పడిపోయాం. గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌ లేకపోతే జీవితమే గడవని స్థితికి వచ్చేశాం. ముగ్గుల నుంచి మూంగ్‌ దాల్‌ రెసిపీ వరకు.. బిగ్‌ బాస్‌ దగ్గర నుంచి బిట్‌కాయిన్‌ వరకు.. ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్‌ను ఆశ్రయించాల్సిందే!  

‘హౌ టు’‘వాట్‌ ఈజ్‌’ట్రెండింగ్‌ లిస్ట్‌లో ఈ రెండూ టాప్‌లో నిలిచాయి. ముగ్గులు, ఆయుష్మాన్‌ భారత్‌ ‘హౌ టు’శోధన జాబితాలో మూడు, ఆరో స్థానాల్లో ఉన్నాయి. మొబైల్‌ నెట్‌వర్క్‌ను మార్చుకోవడం, బిట్‌కాయన్‌లో ఇన్వెస్ట్‌ చేయడం, హోలి రంగుల్ని కడుక్కోవడం, పదో తరగతి ఫలితాలు చూసుకోవడం, రూబిక్స్‌ క్యూబ్‌ను సాల్వ్‌ చేయడం, ఎన్‌ఆర్సీలో పేర్లను పరిశీలించుకోవడం ఎలాగో తెలుసుకునేందుకు అత్యధికులు గూగుల్‌ను ఆశ్రయించారు. ఇవన్నీ ‘హౌ టు’టాప్‌ టెన్‌ ట్రెండింగ్‌ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై శోధించిన వారిలో ఉత్తరాఖండ్‌ వాసులు ముందున్నారు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఎన్‌ఆర్సీలో తమ పేర్లను ఎలా పరిశీలించుకోవాలో తెలుసుకునేందుకు అత్యధిక అస్సామీలు గూగుల్‌ను వాడుకున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపురవాసులు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. 

’వాట్‌ ఈజ్‌’ట్రెండింగ్‌ లిస్ట్‌లో ‘377 సెక్షన్‌’నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. సిరియా సంక్షోభం, కికి చాలెంజ్, మీ టూ క్యాంపెయిన్, బాల్‌ ట్యాంపరింగ్, నిపా వైరస్, కార్డియాక్‌ అరెస్ట్, చంద్ర గ్రహణం, అవిశ్వాస తీర్మానం, ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ అంశాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.  

బిట్‌ కాయిన్‌పై భారీ శోధన.. 
2017, 2018ల్లో యూజర్లు అత్యధికంగా సెర్చ్‌ చేసింది బిట్‌ కాయిన్‌ గురించే. రెండేళ్లలోనూ ఇది ట్రెండింగ్‌లో ఉంది. ఇండియాలో బిట్‌ కాయిన్‌ను ఎలా కొనుగోలు చేయాలో, ఎలా మైనింగ్‌ చేయాలో, అసలు బిట్‌ కాయన్‌ అంటే ఏమిటో గూగుల్‌ ద్వారా తెలుసుుకోవాలనుకున్న వారు 2017లో అత్యధికంగా ఉన్నారు. ‘వాట్‌ ఈజ్‌’ట్రెండింగ్‌ లిస్ట్‌లో జీస్టీసీ గతేడాది టాప్‌లో ఉంది.. 2017లో.. పాన్‌ కార్డుతో ఆధార్‌ను ఎలా లింక్‌ చేసుకోవాలి? జియో ఫోన్‌ను ఎలా బుక్‌ చేసుకోవాలి? అనేవి హౌ టులో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top