వధువు డ్యాన్స్.. వీడియోలు వైరల్! | crore people Watching This Bride dance video | Sakshi
Sakshi News home page

వధువు డ్యాన్స్.. వీడియోలు వైరల్!

Dec 25 2016 8:57 AM | Updated on Jul 26 2018 5:23 PM

వధువు డ్యాన్స్.. వీడియోలు వైరల్! - Sakshi

వధువు డ్యాన్స్.. వీడియోలు వైరల్!

సాధారణంగా పెళ్లి అనగానే అమ్మాయిలు సిగ్గుపడతారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ వీడియో చూస్తే మాత్రం రిటీన్‌కు భిన్నమని షాక్ అవుతారు.

న్యూఢిల్లీ: సాధారణంగా పెళ్లి అనగానే అమ్మాయిలు సిగ్గుపడతారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ వీడియో చూస్తే మాత్రం రొటీన్‌కు భిన్నమని షాక్ అవుతారు. ఓ పెళ్లివేడుకలో డాన్స్ చేయడానికి తన బంధువులు కాస్త వెనక్కి తగ్గారేమో కానీ, వధువు మాత్రం తానే ముందుగా డ్యాన్స్ స్టార్ట్ చేసి అక్కడున్న వారిలో జోష్ తీసుకొచ్చింది. క్వీన్ మూవీలో కంగనా రనౌత్ డ్యాన్స్ పాటకు స్టెప్పులేసిన ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఢిల్లీకి సాగర్ అరోరా అనే వ్యక్తి ఓ వివాహ వేడుకకు సంబంధించిన రెండు వీడియోలు ఐదు రోజుల కిందట తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో ఓ వీడియోను రికార్డు స్థాయిలో 1.2 కోట్ల మంది వీక్షించగా, మరో వీడియోను 40 లక్షల మంది చూశారు. 1.4 లక్షల మంది వీడియోలను షేర్ చేయగా, 18 వేలకు పైగా నెటిజన్లు కామెంట్ చేశారు.  

మనం ఎన్నో వివాహ వేడుకలు చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం సమ్ థింగ్ స్పెషల్ అంటూ వీడియో పోస్ట్ చేసిన సాగర్ ఆరోరా తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ వీడియో ఫేస్‌బుక్‌లో బ్లాక బస్టర్ అయింది. కొందరు నెటిజన్లయితే సూపర్బ్ ఎంట్రీ అని, మరికొందరు ఇలా ఇక నుంచి వధువులు కంటిన్యూ చేయాలని కామెంట్ చేశారు. అయితే వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి ఆ వివాహం ఎక్కడ జరిగింది, వధువు వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement