
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6,535 కరోనా కేసులు నమోదు కాగా, 146 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,380కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు 60,490 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,167 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 80,722 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
అత్యధికంగా మహారాష్ట్రలో 52,667 కరోనా కేసులు నమోదు కాగా, 15,786 మంది కోలుకున్నారు. 1,695 మంది మృతిచెందారు. ఆ తర్వాత తమిళనాడులో 17,082, గుజరాత్‌లో 14,460, ఢిల్లీలో 14,053 కరోనా కేసులు నమోదయ్యాయి.