ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఢిల్లీలోని పలువురు ప్రముఖులను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆహ్వానించారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఢిల్లీలోని పలువురు ప్రముఖులను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ లను బుధవారం ఆయన కలిసి ఆమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రధానిని కలిసిన ఆయన ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణంపై చర్చించారు. రాజధాని నిర్మాణానికి అందరి సహకారం అవసరమని చంద్రబాబునాయుడు తెలిపారు.