ప్రాణాలను పణంగా పెట్టి కాపాడారు.. | car washed away in dehradun's nalapani following heavy rains | Sakshi
Sakshi News home page

ప్రాణాలను పణంగా పెట్టి కాపాడారు..

Sep 5 2017 12:19 PM | Updated on Sep 12 2017 1:57 AM

ఉత్తరాఖండ్‌లో జోరుగా కురుస్తున్న వర్షాలతో వరదలు ఉప్పొంగుతున్న నదులను తలపిస్తున్నాయి.

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లో జోరుగా కురుస్తున్న వర్షాలతో వరదలు ఉప్పొంగుతున్న నదులను తలపిస్తున్నాయి. ఓ జంట ప్రయాణిస్తున్న కారు వరద మధ్యలో చిక్కుకుంది. వరద దాటికి కారు సైతం కొట్టుకుపోయే పరిస్థితి. అక్కడ ఉన్న స్థానికులు ప్రాణాలను పణంగా పెట్టి వారిని కాపాడటానికి ముందుకెళ్లారు. ఒక్కసారి ప్రమాదం వారి వైపు మళ్లింది.

వారిని రక్షించే క్రమంలో కారుని ఒడ్డుకి మధ్య ఏర్పాటు చేసిన నిచ్చెన ఒక్కసారిగా విరిగిపోయింది. వారు వరదలో కొట్టుకుపోతుండగా ఒడ్డున ఉన్న వారు చేయి చేయి కలిపి వారిని కాపాడారు. ఈ సంఘటన డెహ్రాడూన్‌లోని నలపాణిలో చోటుచేసుకుంది. ఇది ఓ ఫోన్‌లో రికార్డవడంతో సోషల్‌ మీడియాలో చక్కర్లుకొడుతోంది. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement