
రాజకీయ జీవితం ముగుస్తుందనే భయంతోనే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రియాంక రాజకీయ జీవితం ఆరంభంలోనే ముగిసిపోతుందనే భయంతోనే ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి నుంచి ఆమెను కాంగ్రెస్ పార్టీ బరిలో దింపలేదని యోగా గురు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. కాపలాదారు దొంగ కాదని, ఆయన స్వచ్ఛతకు మారుపేరని ప్రధాని మోదీని రాందేవ్ వెనుకేసుకొచ్చారు. బీజేపీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ఆర్టికల్ 370 రద్దు హామీని ఆయన సమర్ధించారు.
కాగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వారణాసిలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఏడు దశల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తుదివిడత పోలింగ్‌లో వారణాసి నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా, భారీగా పార్టీ శ్రేణులు, సీనియర్ నేతలు వెంటరాగా ప్రధాని మోదీ నామినేషన్ వేశారు.