ఎల్.కె.అద్వానీ, మల్లారెడ్డి
వృద్ధాప్యం కారణంగా నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో స్థానం దక్కించుకోలేని 86 ఏళ్ల బిజెపి సీనియర్ నేత అద్వానీని మరో పదవి వరించింది.
	న్యూఢిల్లీ: వృద్ధాప్యం కారణంగా నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో  స్థానం దక్కించుకోలేని 86 ఏళ్ల బిజెపి సీనియర్ నేత అద్వానీని మరో పదవి 
వరించింది. 75 ఏళ్లు దాటిన వారిని తన మంత్రి వర్గంలోకి మోడీ తీసుకోదలచుకోని విషయం తెలిసిందే. లోక్సభ నైతికవిలువల కమిటీ అధ్యక్షుడుగా ఎల్కె ఆద్వానీని స్పీకర్ సుమిత్రా మహాజన్  నియమించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మల్కాజిగిరి టిడిపి ఎంపి  చామకూర మల్లారెడ్డిని కూడా ఈ కమిటీలో సభ్యుడిగా నియమించారు.  
	
	ఈ కమిటీలో అరుమోజితెవాన్, నినాంగ్ రింగ్, షేర్ సింగ్ గుబే, హేమంత్ తుకారాం,ప్రహ్లాద జోషి, భగత్ సింగ్ కోష్యారి, అర్జున్ రామ్ మెగ్వాల్, భత్రుహరి, కరియా ముండే, జయశ్రీబెన్ పటేల్, సుమేథనాద్ సరస్వతి, భోల్ సింగ్లను సభ్యులుగా నియమించారు.
	**

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
