ఢిల్లీ వీధుల్లో ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫెసర్‌‌, వైరల్‌ పోస్ట్‌

76 Year Old Oxford Graduate Living On Delhi Streets, Said Viral Post - Sakshi

న్యూఢిల్లీ : చేతికి వచ్చిన కొడుకులు పట్టించుకోకుండా రోడ్డుపై వదిలివేసిన ఓ 74 ఏళ్ల ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫెసర్‌కు సోషల్‌ మీడియా ఓ గూడు చూపించింది. నాలుగు దశాబ్దాలుగా వీధుల్లోనే నివాసం గడిపిన ఇతనికి తలదాచుకోవడానికి చోటు కల్పించింది. ఈ ప్రొఫెసర్‌పై ఢిల్లీకి చెందిన అవినాష్‌ సింగ్‌ చేసిన ఫేస్‌బుక్‌ పోస్టు ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. రాజా సింగ్‌ ఫూల్‌.. ఒకానొక సమయంలో ఎంతో ఖ్యాతి గడించిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి ప్రొఫెసర్‌. కానీ ఆయన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఎంతో దుర్భాంతకరమైన సంచార జీవితం గడుపుతున్నారు. 1960లో తన సోదరుడితో పాటు భారత్‌కు వచ్చిన రాజా సింగ్‌, ముంబైలో మోటార్‌ పార్ట్‌ల వ్యాపారం మొదలు పెట్టారు. కానీ తన సోదరుడు మరణిచడంతో ఆ వ్యాపారం కుదేలైంది. అంతేకాక అతని ఇద్దరు కుమారు కూడా రాజాసింగ్‌ను విడిచిపెట్టారు. 

కొడుకులను విదేశాలకు పంపించడానికి చాలా హార్డ్‌ వర్క్‌ చేశానని రాజా సింగ్‌, అవినాష్‌ చేసిన  పోస్టులో చెప్పారు. రుణం తీసుకుని మరీ కొడుకుల్ని చదివించి, ఒకర్ని యూకేకి, మరొకర్ని అమెరికాకి పంపించినట్టు తెలిపారు. కానీ వారు ప్రస్తుతం తమ భార్యలతో పాటు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, కనీసం తండ్రిని చూడటానికి కూడా వారికి తీరిక దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీసా సెంటర్‌ బయట దరఖాస్తులను నింపుతూ రాజా సింగ్‌ తన కాలం గడుపుతున్నట్టు తెలిపారు.

‘దరఖాస్తులను నింపుతుంటా, వారికి సాయపడతుంటాను’  అని రాజా సింగ్‌ , అవినాష్‌ చేసిన ఫేస్‌బుక్‌ పోస్టులో చెప్పారు. కనీసం తల దాచుకోవడానికి ఓ ఇళ్లంటూ లేని ఈ 74 ఏళ్ల ఆక్స్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు సాయం చేయాలంటూ అవినాష్‌ ఈ పోస్టు చేశాడు. ఏప్రిల్‌ 21న షేర్‌ అయిన ఈ పోస్టుకు ఒక్కసారిగా అనూహ్య స్పందన వచ్చింది. 5000కు పైగా షేర్లు రావడమే కాక, రాజా సింగ్‌కు సాయం చేస్తామంటూ చాలా మంది ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆయన్ని న్యూఢిల్లీలోని ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌కు తరలించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top