రాజస్థాన్ అసెంబ్లీ నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
రాజస్థాన్ అసెంబ్లీ నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వారు ముగ్గురూ ఎంపీలుగా ఎన్నికవడంతో వారు తమ ఎమ్మెల్యే పదవులను వదులుకున్నారు. ఓం బిర్లా, బహదూర్ కోలి, సంతోష్ అహ్లావత్ అనే ఈ ముగ్గురూ వరుసగా కోట, భరత్పూర్, ఝున్ఝును లోక్సభ స్థానాల నుంచి విజయం సాధించారు.
దీంతో ఆ ముగ్గురూ తమ రాజీనామా పత్రాలను రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ కైలాష్ మేఘ్వాల్కు సమర్పించారు. వీళ్లలో బిర్లా గతంలో కోటా దక్షిణ అసెంబ్లీ స్థానానికి, కోలీ వైర్ స్థానానికి, అహ్లావత్ సూరజ్గఢ్ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. మరో బీజేపీ ఎమ్మెల్యే సన్వర్లాల్ జాట్ కూడా అజ్మీర్ స్థానం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచారు. ఆయన ఇంకా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంది.