బుద్ధిచెప్పిన యువతి సాహసానికి రివార్డు | 19-year-old girl awarded for her bravery | Sakshi
Sakshi News home page

బుద్ధిచెప్పిన యువతి సాహసానికి రివార్డు

Nov 3 2014 7:29 PM | Updated on Aug 21 2018 9:06 PM

తైక్వాండో, వుషులలో జాతీయస్థాయి క్రీడాకారిణి అయిన ఓ యువతి.. తనను వేధించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కొని, అతడిని పోలీసులకు కూడా పట్టించింది.

తైక్వాండో, వుషులలో జాతీయస్థాయి క్రీడాకారిణి అయిన ఓ యువతి.. తనను వేధించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కొని, అతడిని పోలీసులకు కూడా పట్టించింది. దాంతో ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్న ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ ఆమెకు రూ. 10 వేల రివార్డు అందజేశారు. బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమెకు ఓ పతకం కూడా బహూకరించారు. ఈ యువతి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిందని బస్సీ ప్రశంసించారు.

అమ్మాయిలు ఆత్మరక్షణ కోసం ఇలాంటి విద్యల్లో శిక్షణ పొందాలని, అప్పుడే ఏమైనా ఆపద వచ్చినప్పుడు వాళ్లు తమను తాము కాపాడుకోగలరని ఆయన అన్నారు. మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్, రెడ్ బెల్టులు పొందిన ఆ యువతి.. పలు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఆమె ఇంటికి తిరిగి వస్తుండగా, రాజేష్ గుప్తా (28) అనే యువకుడు ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఆమె అతగాడికి నాలుగు పంచ్లు బహూకరించి, తన ట్రైనర్ అమిత్ గోస్వామి సాయంతో పోలీసులకు అప్పగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement