విజయ్‌ దేవరకొండ సినిమాలో సీరియల్ నటి

Vani Bhojan To Make Telugu Debut In Vijay Devarkonda First Film As A Producer - Sakshi

టాలీవుడ్ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్ దేవరకొండ సినిమాలో ఓ తమిళ సీరియల్ నటి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో విజయ్‌ హీరోకాదు కేవలం నిర్మాత మాత్రమే. ఇటీవల కింగ్‌ ఆఫ్‌ ద హిల్‌ బ్యానర్‌ను స్థాపించిన విజయ్ దేవరకొండ తన సినిమాలకు భాగస్వామిగా వ్యవహరించటంతో పాటు కొత్త నటీనటులు, దర్శకులను పరిచయం చేస్తూ సినిమాలు తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

తొలి ప్రయత్నంగా పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో తమిళ నాట షార్ట్‌ ఫిలింస్‌తో ఫేమస్‌ అయిన సమీర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీలో తరుణ్‌కు జోడిగా తమిళ సీరియల్‌ నటి వాణి భోజన్ నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌మీదకు వెళ్లనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top