హద్దులు దాటితే అంతు చూడాలి! | The Other Side of Ileana D'Cruz | Sakshi
Sakshi News home page

హద్దులు దాటితే అంతు చూడాలి!

Sep 26 2015 11:04 PM | Updated on Apr 3 2019 5:44 PM

హద్దులు దాటితే అంతు చూడాలి! - Sakshi

హద్దులు దాటితే అంతు చూడాలి!

ఇలియానా చాలా ఫ్రెండ్లీ టైప్. అందరితో సరదాగా ఉంటారు. షూటింగ్ లొకేషన్లో అయితే ఇలియానా ఉంటే సందడి ఉన్నట్లే అని చాలామంది అంటుంటారు.

ఇలియానా చాలా ఫ్రెండ్లీ టైప్. అందరితో సరదాగా ఉంటారు. షూటింగ్ లొకేషన్లో అయితే ఇలియానా ఉంటే సందడి ఉన్నట్లే అని చాలామంది అంటుంటారు. కో-స్టార్స్‌తో అంత ఫ్రెండ్లీగా మాట్లాడతారట. ఈ విషయం గురించి ఇలియానా మాట్లాడుతూ - ‘‘కలుపుగోలుతనంగా ఉండటం నాకిష్టం. అది ఓ విధంగా ప్లస్.. మరో విధంగా మైనస్. ప్లస్ ఏంటంటే.. అందరూ చక్కగా మాట్లాడతారు. మైనస్ ఏంటంటే.. కొంతమంది అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు.
 
 అది మనం గ్రహించగలగాలి. లేకపోతే హద్దులు దాటేస్తారు. తేడాగా ప్రవర్తించడానికి ట్రై చేస్తారు. అలాంటివాళ్లను దూరం పెట్టేయాలి. హద్దులు దాటినప్పుడు అంతు చూడటానికి వెనకాడకూడదు. నేనైతే మనుషుల మనస్తత్వాలను సులువుగానే గ్రహించగలుగుతాను. నాతో ఎవరైనా పిచ్చిగా ప్రవర్తించాలని అనుకుంటే, వాళ్ల బాడీ లాంగ్వేజ్ ద్వారా అర్థం చేసేసుకుంటా. చాలా తెలివిగా వాళ్లని పక్కన పెట్టేస్తా’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement