అన్ని అంశాలతో.. | 'The Bells' shooting completed except for patchwork | Sakshi
Sakshi News home page

అన్ని అంశాలతో..

Feb 7 2015 11:49 PM | Updated on Aug 20 2018 8:20 PM

అన్ని అంశాలతో.. - Sakshi

అన్ని అంశాలతో..

సందేశంతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న చిత్రం ‘ది బెల్స్’. జగదాంబ ప్రొడక్షన్స్ పతాకంపై ఎర్రోజు వెంకటాచారి

 సందేశంతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న చిత్రం ‘ది బెల్స్’. జగదాంబ ప్రొడక్షన్స్ పతాకంపై ఎర్రోజు వెంకటాచారి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ నెల్లుట్ల దర్శకుడు. ‘ఆడపిల్లనమ్మా నేను ’ అనే  ప్రైవేట్ సాంగ్‌తో సుపరిచితురాలైన మధుప్రియ పై పాట చిత్రీకరణతో ఈ చిత్రం పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘అనుకున్న విధంగా ఈ చిత్రం వచ్చిందంటే  దానికి కారణం మా నిర్మాతే. అలాగే  అతిథి పాత్రలో నటించిన తెలంగాణా భారీ నీటిపారుదల సలహాదారులు విద్యాసాగర్‌రావు గారికి నా కృతజ్ఞతలు. త్వరలో పాటలు విడుదల చేసి, మార్చిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కాసర్ల శ్యామ్, పాటలు: వరికుప్పల యాదగిరి, కాకర్లశ్యామ్, గోరటి వెంకన్న కెమెరా: ఉదయ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement