సోల్జర్‌ సూర్య!

Suriya's new look in KV Anand's film revealed - Sakshi

దేశం కోసం ఎందాకైనా తెగిస్తా అంటున్నారట హీరో సూర్య. ఎందుకంటే ఆయన తన తాజా సినిమాలో సైనికుడి పాత్రలో కనిపించనున్నారని కోలీవుడ్‌ టాక్‌. కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయేషా కథానాయికగా నటిస్తున్నారు. బొమన్‌ ఇరానీ, మోహన్‌లాల్, ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ షూటింగ్‌ స్పాట్‌లో సూర్య లుక్‌కి చెందిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొట్టింది. ఈ ఫొటోలో సూర్య ఆర్మీ ఆఫీసర్‌లా హెయిర్‌ కట్‌ చేయించుకుని కనిపించారు.

అంతే.. సూర్య సోల్జర్‌ పాత్రలో కనిపిస్తారన్న ఊహగానాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో బలమైన సందేశం కూడా ఉంటుందట. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక తారాగణంపై సన్నివేశాలు తీస్తున్నారు. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... సూర్య హీరోగా సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ‘ఎన్‌జీకే’ (నందగోపాల కుమారన్‌) అనే సినిమా రూపొందుతోంది. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను దీపావళికి రిలీజ్‌ చేయాలను కున్నారు. కానీ, వాయిదా వేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top