షేక్‌ చేస్తున్న ‘శ్రీదేవి’ టిక్‌టాక్‌ వీడియోలు

Sridevi TikTok lookalike is grabbing internet with her videos - Sakshi

బాలీవుడ్‌, టాలీవుడ్‌ నటుల పోలికలతో ఉన్న చాలామంది టిక్‌టాక్‌ వీడియోలు గతంలో అభిమానులను విపరీతంగా ఆకర్షించాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ లోకాన్ని వీడి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను శోకసంద్రంలోముంచిన అలనాటి అందాలతార శ్రీదేవి ఇపుడు టిక్‌టాక్‌ ద్వారా అభిమానుల జ్ఞాపకాల్లో విహరిస్తున్నారు. మరణించి సుమారు రెండేళ్లు కావస్తున్నా ఫ్యాన్స్‌ అభిమానుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ ఆర్టిస్ట్‌ రాఖీ వీడియోలతో సంచలనం రేపుతోంది. బాలీవుడ్‌ లేడీ సూపర్‌స్టార్‌ శ్రీదేవి పోలికలతో ఉన్న క్వీన్‌ రాఖీ పేరుతో ఆమె టిక్‌ టాక్‌ వీడియోలు ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్నాయి. శ్రీదేవి నటించిన పలు ప్రముఖ చిత్రాలతోపాటు చాల్‌బాజ్, నాగిని హిమ్మత్‌వాలా పాటలు, ఇతర సెన్సేషనల్‌ మూవీల డైలాగుల టిక్‌టాక్‌ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top