డైనమిక్‌ కమ్‌బ్యాక్‌ | Shilpa Shetty to make a comeback after 13 years with Nikamma | Sakshi
Sakshi News home page

డైనమిక్‌ కమ్‌బ్యాక్‌

Aug 2 2019 2:48 AM | Updated on Aug 2 2019 2:48 AM

Shilpa Shetty to make a comeback after 13 years with Nikamma - Sakshi

సుమారు పదమూడేళ్ల తర్వాతఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో నటించడానికి రెడీ అవుతున్నారు శిల్పాశెట్టి. దాదాపు రెండు దశాబ్దాలపాటు హీరోయిన్‌గా సత్తా చాటారామె. ఇప్పుడు ‘నికమ్మా’ అనే యాక్షన్‌ ఫిల్మ్‌లో ఓ కీలక పాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు శిల్పా. ఈ చిత్రంలో అభిమన్యు దాసాని, షెర్లీ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. షబ్బీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించనున్నారు. ‘‘నా కెరీర్‌లో ఇప్పటివరకు నేను ఇలాంటి పాత్ర చేయలేదు. ఈ పాత్ర నాకు ఎంతగానో నచ్చింది. ఇది ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌. ఆడియన్స్‌కు నా కొత్త అవతారాన్ని చూపించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని శిల్పాశెట్టి అన్నారు.

‘‘శిల్పాశెట్టి మా సినిమాతో మళ్లీ కమ్‌బ్యాక్‌ ఇవ్వబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఆమె పాత్ర డైనమిక్‌గా ఉంటుంది’’ అన్నారు షబ్బీర్‌ఖాన్‌ అన్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో లండన్‌లో ఉన్నారు శిల్పా. హాలిడేస్‌ ఎంజాయ్‌ చేసి, ముంబై తిరిగి రాగేనే ‘నికమ్మా’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘ఓమ్‌ శాంతి ఓమ్‌’ (2007), దోస్తానా (2008), ధీక్షియా వుమ్‌ (2014) చిత్రాల్లో శిల్పా నటించినప్పటికీ వాటిలో అతిథి పాత్రలే. ఇప్పుడు ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో కనిపించనుండటం ఆమె అభిమానులకు తీయని వార్తే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement