హాలీవుడ్‌కి హలో

Shabana Azmi to feature in Steven Spielberg's series Halo - Sakshi

బాలీవుడ్‌ నటి షబానా ఆజ్మి బుడాపెస్ట్‌ ప్రయాణానికి సిద్ధమయ్యారు. హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ నిర్మిస్తున్న ‘హాలో’ వెబ్‌ సిరీస్‌లో ముఖ్య పాత్రలో షబానా నటించనున్నారు. ‘హాలో’ అనే పాపులర్‌ వీడియో గేమ్‌ ఆధారంగా ఈ సిరీస్‌ తెరకెక్కనుంది. ఈ విషయం గురించి షబానా మాట్లాడుతూ – ‘‘ఇదో కొత్త ప్రయాణం. చాలా ఎగై్జట్‌మెంట్‌తో పాటు కొంచెం నెర్వస్‌గానూ ఉంది. ఈ ప్రాజెక్ట్‌ అనుకోకుండా నా దగ్గరకు వచ్చింది. దీనికోసం రెండు సినిమాలను కూడా వదులుకున్నాను. ఆ సినిమాలు వదులుకునేంత విలువైందే ఈ సిరీస్‌ అనుకుంటున్నాను’’ అన్నారు. అక్టోబర్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. ఇదివరకు ‘సిటీ ఆఫ్‌ జాయ్, లా నూట్‌ బెంగాలీ’ అనే హాలీవుడ్‌ చిత్రాల్లో నటించారు షబానా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top