సింగర్‌ టు నక్సలైట్‌!

Sai Pallavi trains under an ex-naxal leader for her next - Sakshi

తుపాకీతో ఎలా కాల్చాలి? బాంబులు ఎలా వేయాలి? అని ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట సాయి పల్లవి. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్‌ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రధారులుగా ‘విరాట పర్వం’ అనే చిత్రం తెరకెక్కుతోంది. గాయకురాలిగా ఉండి, కొన్ని అనూహ్య పరిణామాల మధ్య నక్సల్‌ ఉద్యమంలో చేరే ఓ యువతి పాత్రలో నటిస్తున్నారు సాయి పల్లవి. నక్సలైట్ల బాడీ లాంగ్వేజ్, వేషధారణ, కూంబింగ్‌ ఆపరేషన్స్‌ వంటి విషయాల్లో అవగాహన కోసం ఓ మాజీ నక్సలైట్‌ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారట సాయి పల్లవి. ఇందులో పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపిస్తారు రానా. ఈ చిత్రంలో నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరీ రావ్‌ కీలక పాత్రధారులు. 1980 నేపథ్యంలో సాగే  ఈ సినిమా చిత్రీకరణను ఎక్కువ శాతం వరంగల్, మెదక్, కరీంనగర్‌లో ప్లాన్‌ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top