బాలీవుడ్‌లోనే ఆదరణ!

Rashi Khanna Comments About Bollywood - Sakshi

తమిళసినిమా: బాలీవుడ్‌లోనే బాగా ఆదరణ ఉంటుంది అని చెప్పింది నటి రాశీఖన్నా. బాలీవుడ్‌లో నటిగా ఎంట్రీ ఇచ్చినా ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌ అంటూ పరుగులు తీస్తున్న నటి ఈ బ్యూటీ. పేరులోనే రాశిని పెట్టుకున్న ఈ భామ.. రాశి గల నటి అనే పేరు తెచ్చుకుంటోంది. అయితే ఇంకా స్టార్‌ ఇమేజ్‌ కోసం పోరాడాల్సి ఉంది. యువస్టార్స్‌తో జత కట్టే అవకాశాలే ఈ బ్యూటీ తలుపు తడుతున్నాయి. స్టార్స్‌ హీరోలతో జత కట్టే అవకాశాలు అందుకోవలసి ఉంది. కాగా తమిళంలో ఒమైకానొడగల్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి తొలి చిత్ర సక్సెస్‌ బాగానే హెల్ప్‌ అయ్యింది. ఆ తరువాత జయంరవి సరసన అడంగమరు, విశాల్‌తో అయోగ్య, విజయ్‌సేతుపతికి జంటగా సంఘతమిళన్‌ వంటి చిత్రాల్లో నటించింది. అలాంటి ప్రస్తుతం ఇక్కడ కాస్త జోరు తగ్గింది. సిద్ధార్థ్‌తో నటిస్తున్న సైతాన్‌ కా బచ్చా చిత్రం మినహా మరో అవకాశం లేదు. అయితే టాలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉంది. కోలీవుడ్‌లో అవకాశాల వేటలో పడింది. అందుకు గ్లామరస్‌ ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ సినీ వర్గాల దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తోంది.

కాగా ఈ చిన్నది  వెంకటేశ్‌. నాగచైతన్యలతో కలిసి నటించిన వెంకీమామ చిత్రం ఈ వారం తెరపైకి రానుంది.  అందాలారబోత విషయంలో వెనుకాడని రాశీఖన్నా, ఇటీవల బాగా కసరత్తులు చేసి మరింత సన్నబడి నవనవలాడుతోంది. అందుకు కారణాన్ని కూడా చెప్పింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాశీఖన్నా మాట్లాడుతూ కాస్త లావుగా ఉంటే దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడానికి వెనుకాడుతున్నారని చెప్పింది. అందుకే సన్నబడడానికి కసరత్తులు చేసినట్లు చెప్పింది. అంతేకాకుండా సహ నటీమణుల నుంచి పోటీని ఎదుర్కొనడానికి ఇది అవసరమైందని చెప్పుకొచ్చింది. మరో విషయం ఏమిటంటే దక్షిణాది కంటే హిందీలోనే తనకు బాగా ఆదరణ లభిస్తోందని తెలిపింది. తనకు బాలీవుడ్‌కు వెళ్లడానికి ఇష్టం లేదని చెప్పింది. తాను నాలుగేళ్లుగా హైదరాబాద్‌లోనే నివశిస్తున్నానని చెప్పింది. ఇంకా చెప్పాలంటే అక్కడే సెటిల్‌ అయ్యానని రాశీఖన్నా చెప్పింది. కాగా సిద్ధార్థ్‌తో కలిసి నటించిన సైతాన్‌ కా బచ్చా చిత్రం త్వోరలో విడుదలకు ముస్తాబవుతోంది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top