డాన్ చోటా రాజన్పై వర్మ ట్వీట్ | ramgopal varma tweets on chota rajan,s arrest | Sakshi
Sakshi News home page

డాన్ చోటా రాజన్పై వర్మ ట్వీట్

Oct 28 2015 5:27 PM | Updated on Sep 3 2017 11:38 AM

డాన్ చోటా రాజన్పై వర్మ ట్వీట్

డాన్ చోటా రాజన్పై వర్మ ట్వీట్

'ఇన్నాళ్లూ గ్యాంగ్ను నడపటంలో చోటా రాజన్ ఎవరెవరు సహకరించారు?

మాఫియా కథాంశాలతో ఒకప్పుడు బాలీవుడ్లో కుప్పలు తెప్పలు సినిమాలు తీసి.. డాన్ల జీవితాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు రామ్గోపాల్ వర్మ. 2002లో ఆయన తీసిన 'కంపెనీ' సినిమా.. దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ల సంబంధాలకు తెర రూపమని చెబుతారు సినీ విశ్లేషకులు. ప్రస్తుతం చోటారాజన్ పోలీసులకు చిక్కాడు. 22 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న చోటా అరెస్టుపై వర్మ సంచలన టీట్ చేశాడు.

'ఇన్నాళ్లూ గ్యాంగ్ను నడపటంలో చోటా రాజన్ ఎవరెవరు సహకరించారు? ఎంత మంది పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తల పేర్లను చోటారాజన్ వెల్లడిస్తాడో? ప్రస్తుతం నాకు అత్యంత ఆసక్తి కలిగిస్తున్న విషయం ఇదే' అంటూ బుధవారం ఓ ట్వీట్ వదిలాడు వర్మ.

భారత నిఘా వర్గానికి చెందిన అధికారులు కొందరు దావూద్ను మట్టుబెట్టేందుకు చోటా రాజన్ను ఉపయోగించుకున్నారని, ఆ క్రమంలో పరోక్షంగా చోటా గ్యాంగ్ విస్తరణకు సహకరించానే సారాంశంతో వార్తాకథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో వర్మ కూడా ఇదే కోణంలో ట్వీట్ చేయడం చర్చనీయంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement