ఇంటెన్స్‌ లుక్‌తో అదరగొడుతున్న రవితేజ

Powerful First Look of RaviTeja Krack Movie - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గట్టి సూపర్‌హిట్‌ కోసం ఎదురుచూస్తున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ కొత్త సంవత్సరంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. ఇప్పటికే రవితేజ సైన్స్-ఫిక్షన్‌ డ్రామా ‘డిస్కోరాజా’ సినిమా ఈ నెల 24న విడుదలయ్యేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు ‘క్రాక్‌’ సినిమా కూడా శేరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. రవితేజ సరసన శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తుండగా.. ఠాగూర్‌ మధు నిర్మిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ బుధవారం విడుదల చేశారు. సోడా బాటిల్‌ పట్టుకొని పోలీసు ఆఫీసర్‌గా ఇంటెన్స్‌ లుక్‌లో కనిపిస్తున్న రవితేజ ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ పోస్టర్‌లో ర‌వితేజ బ్యాక్‌సైడ్ ఖైదీలు నిల‌బ‌డి ఉండ‌టాన్ని చూడొచ్చు.

ర‌వితేజ‌, గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో ఇంతకుముందు డాన్‌శీను, బ‌లుపు చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం క్రాక్‌. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తయ్యాయి. ఈ సినిమాలో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని అన్నీ వ‌ర్గాల ప్రేక్షకుల‌ను మెప్పించేలా ఈ సినిమాను గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్నారు. ఈ ఏడాది స‌మ్మర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అం‍దిస్తున్న ఈ సినిమాలో స‌ముద్రఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌పాత్రల్లో న‌టిస్తున్నారు.

న‌టీన‌టులు: ర‌వితేజ‌, శృతిహాస‌న్‌, సుమ‌ద్రఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, దేవీ ప్రసాద్‌, పూజిత పొన్నాడ‌, చిరాగ్ జాని, మౌర్యాని, హ్యాపీడేస్ సుధాక‌ర్‌, వంశీ చాగంటి త‌దిత‌రులు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శక‌త్వం:  గోపీచంద్ మ‌లినేని, నిర్మాత‌:  బి.మ‌ధు, బ్యాన‌ర్‌:  స‌రస్వతి ఫిలింస్ డివిజ‌న్‌, సినిమాటోగ్రఫీ:  జి.కె. విష్ణు, డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా, ఫైట్స్‌:  రామ్ ల‌క్ష్మణ్‌,
పాట‌లు:  రామ‌జోగ‌య్య శాస్త్రి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top