‘గీతాంజలి’లో ఆ సీన్‌ తీసేస్తారనుకున్నా : నాగ్‌

Nagarjuna Thought Censor Board Would Cut Kiss Scene In Geethanjali - Sakshi

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన గీతాంజలి చిత్రం నాగార్జునకు మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. టాలీవుడ్‌లో మూసపద్ధతిలో వస్తున్న చిత్రాలకు విరుద్ధంగా గీతాంజలి తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఇద్దరూ చనిపోతారు. సాధారణంగా ఇలాంటి విషాద ముగింపు ఉన్న సినిమాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. కానీ గీతాంజలి అందుకు భిన్నంగా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఈ సినిమాలో పతాక సన్నివేశంలో వచ్చే ముద్దు సీన్‌.. ఈ చిత్రానికి గుండెకాయ లాంటిది. అలాంటి ఈ సన్నివేశాన్ని ఎక్కడ తీసేస్తారో అని మన్మథుడు తెగ కంగార పడ్డారట. ఈ విషయాన్ని నేరుగా నాగార్జునే వెల్లడించాడు.

ఇటీవలె ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఎక్కువ నిడివితో ఉన్న ముద్దు సన్నివేశమే సినిమకు ప్రాణం. దాన్ని సెన్సార్‌ బోర్డు తీసివేస్తుందేమోనని భయపడ్డాను. నా తండ్రితో కూడా ఈ విషయాన్ని చెప్పాను. సినిమా చూసిన తర్వాత ఈ చిత్రం మొత్తానికి ఇదే హైలెట్‌ అవుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సన్నివేశాన్ని వాళ్లు తొలగించరని భరోసా ఇచ్చారు. నాన్న చెప్పినట్టుగానే వారు ముద్దు సన్నివేశాన్ని తొలగించలేదు’ అంటూ గీతాంజలిని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం నాగ్‌ ‘మన్మథుడు-2’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఆగస్టు 9న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top