సుప్రీం హీరో రెడీ టు షూట్‌..!

Mega Hero Sai Dharam Tej Ready With New Look - Sakshi

మెగా వారసుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయిన యంగ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లో మంచి ఫాంలో కనిపించిన ఈ యంగ్‌ హీరో తరువాత తడబడ్డాడు. వరుస ఫ్లాప్‌లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. ముఖ్యంగా నక్షత్రం, జవాన్‌, ఇంటిలిజెంట్‌, తేజ్‌ ఐ లవ్‌యు సినిమాల్లో సాయి లుక్‌పై కూడా విమర్శలు వచ్చాయి.

దీంతో ఆలోచనలో పడ్డా సాయి ధరమ్ తేజ్‌ తదుపరి చిత్రాన్ని ప్రారంభించడానికి గ్యాప్‌ తీసుకున్నాడు. కొద్ది రోజులుగా అమెరికాలో ఉంటూ సరికొత్త లుక్‌లోకి మారే ప్రయత్నం చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం సాయి ధరమ్‌ తేజ్‌ న్యూ లుక్‌లో రెడీ అయిపోయాడట. ఫిట్‌ బాడీతో పాటు డిఫరెంట్ హెయిర్‌ స్టైల్‌ తో రెడీ అయినట్టుగా తెలుస్తోంది.

త్వరలోనే సాయి ధరమ్‌ తేజ్‌ తన కొత్త సినిమాను సెట్స్‌మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట. నేను శైలజ ఫేం కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్టోబర్‌లోనే సెట్స్‌ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాను సక్సెస్‌ఫుల్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై రూపొందించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top