‘గ్లామర్‌ వాలా, సఫాయీ వాలా ఒకటే’

Masaba Recall The Lessons Moms Neena Gupta Taught Her In Childhood - Sakshi

చిన్ననాటి ఫొటో షేర్‌ చేసిన మసాబా గుప్తా

‘‘ఏ పనీ చిన్నది కాదు. గ్లామర్‌వాలా అయినా సఫాయీ వాలా అయినా ఒకటే అని నీనా గుప్తా నాకు ఎప్పుడూ చెబుతూ ఉంటారు’’ అని ప్రముఖ ప్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా తన పెంపకంలో తల్లి అవలంబించిన విధానాన్ని అభిమానులతో పంచుకున్నారు. తల్లి నీనా గుప్తా చిన్నతనంలో తనను అందంగా ముస్తాబు చేసిన ఫొటోతో పాటు చేతిలో చీపురు పట్టుకుని ఉన్న ఫొటో షేర్‌ చేసి ఈ విధమైన క్యాప్షన్‌ జతచేశారు. కాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటి నీనా గుప్తా- వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్ వివియన్‌ రిచర్డ్స్‌ల కూతురైన మసాబా గుప్తా ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ సోనం కపూర్‌, ఆమె సోదరి, నిర్మాత రియా కపూర్‌ తదితర సెలబ్రిటీలకు ఆమె వైవిధ్యమైన, ట్రెండీ దుస్తులు డిజైన్‌ చేసి ఫ్యాషన్‌ ప్రియుల మన్ననలు అందుకున్నారు.  (వారి విడాకుల విషయం కుంగదీసింది: నటి)

కాగా వివాహితుడైన రిచర్డ్స్‌ను ప్రేమించిన నీనా గుప్తా... పెళ్లి కాకుండానే 1989లో మసాబాకు జన్మనిచ్చారు. సింగిల్‌ మదర్‌గా ఉన్నప్పటికీ తన తండ్రి సాయంతో బిడ్డకు ఎటువంటి లోటు రాకుండా అపురూపంగా పెంచుకున్నారు. ఇటీవల తన మనోభావాలను వెల్లడించిన నీనా... పెళ్లైన వ్యక్తి ప్రేమలో పడి తాను తప్పుచేశానని.. సమాజం నుంచి ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కొన్నానంటూ కూతురి పెంపకంలో తనకు ఎదురైన సవాళ్ల గురించి చెప్పుకొచ్చారు. ఇక 2015లో ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ మధు మంతెనను వివాహం చేసుకున్న మసాబా.. ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు విడాకుల విషయం తెలిసి తాను విషాదంలో మునిగిపోయానని.. తనపై తీవ్ర ప్రభావం చూపిన విషయం ఇదేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మసాబా ప్రస్తుతం ఆమె అదితీరావ్‌ హైదరీ మాజీ భర్త, నటుడు సత్యదీప్‌ మిశ్రాతో ప్రేమలో పడినట్లు బీ- టౌన్‌ టాక్‌. గోవాలోని సత్యదీప్‌ ఇంట్లో వీరిద్దరు లాక్‌డౌన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి.(హీరోయిన్‌ మాజీ భర్త ప్రేమలో మసాబా!?)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top