ఒప్పుకున్నట్లేనా? | Malaika Arora’s new pendant stands for her own name and not Arjun Kapoor’s | Sakshi
Sakshi News home page

ఒప్పుకున్నట్లేనా?

Nov 30 2018 6:04 AM | Updated on Nov 30 2018 6:04 AM

Malaika Arora’s new pendant stands for her own name and not Arjun Kapoor’s - Sakshi

మలైకా అరోరా, అర్జున్‌ కపూర్

అర్జున్‌ కపూర్, మలైకా అరోరా కలసి పార్టీలకు వెళ్తున్నారు. ఫంక్షన్స్‌కు వెళ్తున్నారు. కలసి హాలిడేయింగ్‌ కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని బాలీవుడ్‌ మీడియా టాక్‌.  త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ తమ రిలేషన్‌షిప్‌ గురించి ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడలేదు ఈ జంట. అర్జున్‌ కపూర్‌ మాత్రం నేను సింగిల్‌గా లేను అని ఓ సందర్భంలో పేర్కొన్నారు. తాజాగా మలైకా ‘ఏయమ్‌’ అనే లాకెట్‌ ఉన్న గొలుసును ధరించారు. ఏయమ్‌ అంటే ‘అర్జున్, మలైకా’ అనే అర్థం అంటూ పలు అర్థాలు వినిపిస్తున్నాయి. మరి వీళ్ల మధ్య అనుబంధాన్ని  అఫీషియల్‌గా ఒప్పుకున్నట్లేనా? ఈ విషయం మీద క్లారిటీ రావాలంటే వీళ్లిద్దరైనా ఒప్పుకోవాలి లేదా కాలమే సమాధానం చెప్పాలి.  అన్నట్లు.. వీళ్ల మధ్య 10 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్న సంగతి తెలిసిందే. అర్జున్‌ కంటే మలైకా పదేళ్లు పెద్ద. అయినా ప్రేమకు వయసుతో పనేంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement