కంగనపై కమల్‌ ఖాన్‌ వెటకారపు ట్వీట్‌

Kamal R Khan Satire to Kangana

సాక్షి, సినిమా : గొప్ప విశ్లేషకుడిగా తనను తాను అభివర్ణించుకునే నటుడు కమ్‌ దర్శకుడు కమల్‌ రషీద్‌ ఖాన్‌ మరోసారి తన వెటకారం చూపించాడు. సెలబ్రిటీలను టార్గెట్‌ చేసి విరుచుకుపడి.. ఆపై వాళ్ల ఫ్యాన్స్‌తో తిట్లు తినటం ఈయనగారికి అలవాటే. అయితే ఈసారి మాత్రం ఓ పెను వివాదంపైనే అతని కన్నుపడింది.

బాలీవుడ్‌లో సంచలనంగా మారిన కంగనా రనౌత్‌-హృతిక్‌ రోషన్‌ వ్యవహారంలో అతను వేలు పెట్టాడు. కండల వీరుడికి మద్దతుగా ఈ మధ్య ఓ ట్వీట్‌ చేయగా.. అది ఇప్పుడు మీడియాతోసహా అందరి దృష్టిని ఆకర్షిస్తోది. నటి కరీనా కపూర్‌తో దిగిన ఓ ఫోటోను పోస్ట్‌ చేసిన ఖాన్‌.. కింద ఓ సందేశం పెట్టాడు. ‘నేను-కరీనా నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. కావాలంటే చూడండి ఇదే సాక్ష్యం అంటూ కమల్‌ పేర్కొన్నాడు. అయితే అక్కడ అతని ఉద్దేశం మాత్రం వేరే అన్నది స్పష్టంగా తెలిసిపోతుంది. 

కలిసి ఫోటోలు దిగిటం.. నటించినంత మాత్రాన సంబంధం ఉన్నట్లు ఆరోపించటం సరికాదన్న రీతిలో కంగన, ఆమె చెల్లి రంగోలిని దెయ్యాలంటూ ఈ వివాదాల విశ్లేషకుడు చురకలు అంటించాడు .  ఏది ఏమైనా ఆ ఇద్దరి ఫోటో చూసిన ప్రతీ ఒక్కరూ కమల్‌ కామెడీ టైమింగ్‌కు హాట్సాఫ్‌ చెబుతున్నారు. కరీనా-సైఫ్‌ ఈ పోస్టును చాలా తేలికగానే తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top