ఒక్క సినిమా చేసినా చాలనుకున్నా

Inside Goodachari Thank You Meet - Sakshi

‘‘చిరంజీవిగారి క్లాప్‌తో మొదలైన నా ప్రయాణం ఇక్కడివరకు వచ్చింది. వచ్చిన కొత్తల్లో అందరిలా నేను కూడా స్టార్‌ అవుదామనుకున్నా. వరసగా పది ఫ్లాపులు వచ్చాయి. అయినా నా తర్వాతి సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు జగపతిబాబు. శశి కిరణ్‌ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, శోభితా ధూళిపాళ జంటగా రూపొందిన చిత్రం ‘గూఢచారి’. సుప్రియ ఓ కీలక పాత్ర చేశారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ నామా, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ నెల 3న విడుదలైన ‘గూఢచారి’ సినిమాతో జగపతిబాబు ఇండస్ట్రీలోకి వచ్చి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుంటూనే ‘గూఢచారి’ థ్యాంక్స్‌ మీట్‌ను నిర్వహించారు.
 

జగపతిబాబు మాట్లాడుతూ– ‘‘నా 30 ఏళ్ల సినీ జీవితం ‘గూఢచారి’తో పూర్తవ్వడం హ్యాపీ. అందుకే ఈ చిత్రం నాకు స్పెషల్‌. ఒక్క సినిమా చేస్తే చాలనుకున్న నాకు 30 ఏళ్లు సినిమాలు చేసే అవకాశం కల్పించారు. ఈ థ్యాంక్స్‌ మీట్‌ని నిర్వహించిన నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నటించినందుకు జగపతిబాబుగారికి స్పెషల్‌ థ్యాంక్స్‌. మమ్మల్ని నమ్మిన నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు శేష్‌. ‘‘జగపతి బాబుగారికి మంచి క్రేజ్‌ ఉంది. ఈ సినిమా విజయం సమిష్టి కృషి’’ అన్నారు అనిల్‌ సుంకర. ‘‘జగపతిబాబుగారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. సినిమాను హిట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు అబ్బూరి రవి. ‘‘జగపతి బాబుగారితో వర్క్‌ చేయడం కంఫర్ట్‌గా ఉంటుంది’’ అన్నారు శశికిరణ్‌ తిక్క. ‘‘ఈ సినిమాలో జగపతిబాబుగారు ఉన్నట్లు ముందుగా రివీల్‌ చేయలేదు. అందుకే ఈ సక్సెస్‌మీట్‌లో ఆయన 30 ఇయర్స్‌ సెలబ్రేషన్స్‌ చేశాం’’ అన్నారు వివేక్‌ కూచిభొట్ల. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top