పాట పాడాడు... వాచ్ ఇచ్చారు..! | Dhanush Sings Kannada Song for Shivaraj Kumar Starrer 'Vajrakaya'; How Much is his Remuneration? | Sakshi
Sakshi News home page

పాట పాడాడు... వాచ్ ఇచ్చారు..!

Oct 18 2014 1:10 AM | Updated on Sep 2 2017 3:00 PM

పాట పాడాడు... వాచ్ ఇచ్చారు..!

పాట పాడాడు... వాచ్ ఇచ్చారు..!

‘వై దిస్ కొలవెరి...’ పాటను విచిత్రమైన శైలిలో పాడి, కోలీవుడ్‌నే కాకుండా టాలీవుడ్, శాండిల్‌వుడ్.. ఇలా అన్ని వుడ్స్‌నీ ఆకట్టుకున్నారు తమిళ హీరో ధనుష్.

‘వై దిస్ కొలవెరి...’ పాటను విచిత్రమైన శైలిలో పాడి, కోలీవుడ్‌నే కాకుండా టాలీవుడ్, శాండిల్‌వుడ్.. ఇలా అన్ని వుడ్స్‌నీ ఆకట్టుకున్నారు తమిళ హీరో ధనుష్. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఈ బక్క పలచని హీరో.. మంచి గాయకుడు కూడా. తన చిత్రాలకే కాకుండా అడపా దడపా బయటి హీరోల చిత్రాలకు కూడా పాడుతుంటారు. అయితే, ఇప్పటివరకు తమిళ చిత్రాలకే పాడిన ధనుష్ ఇప్పుడు ఓ కన్నడ చిత్రం కోసం పాట పాడారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ నటిస్తున్న ‘వజ్రకాయ’ చిత్రం కోసం ధనుష్ పాడగా, ఇటీవల ఈ పాటను రికార్డ్ చేశారు.

శివరాజ్, ధనుష్ మంచి స్నేహితులు. సరదాగా స్నేహితుడి కోసం పాడినప్పటికీ, ఆ చిత్రనిర్మాతలు సీఆర్ మనోహర్, సీఆర్ గోపి మాత్రం ధనుష్‌ని ఉత్తి చేతులతో పంపించడానికి ఇష్టపడలేదట. క్యాష్ ఇస్తే బాగుండదని ఓ చేతి గడియారాన్ని బహుమతిగా ఇచ్చారట. దాని విలువ అక్షరాలా నాలుగు లక్షలని సమాచారం. అంటే.. రెగ్యులర్ టాప్ సింగర్స్ తీసుకునే పారితోషికం అన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement