బ్యాంకాక్‌లో దేవదాస్‌

DevaDas Shoot Currently Happening @ Bangkok - Sakshi

హైదరాబాద్‌ టు బ్యాంకాక్‌ మధ్య చెక్కర్లు కొడుతున్నారట హీరో నాని. ఇటు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లో, ‘దేవదాస్‌’ సినిమా కోసం బ్యాంకాక్‌లో బిజీ బిజీగా ఉన్నారాయన. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్‌ నిర్మిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ‘దేవదాస్‌’. ఆకాంక్షా సింగ్, రష్మికా మండన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.

డాన్‌ దేవ పాత్రలో నాగార్జున, డాక్టర్‌ దాస్‌ పాత్రలో నాని కనిపించనున్నారు. శాంతాభాయ్‌ మెమోరియల్‌ హస్పిటల్‌ చుట్టూ కథనం సాగుతుందట. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో జాయిన్‌ అయ్యేందుకు నటుడు మురళీ శర్మ కూడా బ్యాంకాక్‌ వెళ్లారు. రీసెంట్‌గా రిలీజైన ఫస్ట్‌ లుక్‌కు విశేష స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది.మణిశర్మ సంగీతం అందిస్తున్న  ఈ సినిమా సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top