కళ్లు చెదిరే పారితోషకం.. టెంప్ట్‌ అయ్యాడు

Daniel Craig Charged 450 Crores for His Last Bond Movie - Sakshi

హాలీవుడ్‌లో జేమ్స్‌ బాండ్‌ చిత్రాల సిరీస్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 56 ఏళ్ల బ్రాండ్‌.. ఏడుగురు హీరోలు మారారు. అయినా ప్రేక్షకుల ఆదరణ, కలెక్షన్ల హవా ఏ మాత్రం తగ్గట్లేదు. అయితే ప్రస్తుతం బాండ్‌ హీరో అయిన డేనియల్‌ క్రెయిగ్‌.. ఇకపై ఈ సీరిస్‌లో నటించకూడదని బలంగా నిర్ణయించుకున్నాడు. దీంతో కళ్లు చెదిరే రీతిలో నిర్మాతలు అతనికి పారితోషకం ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. 

ది మిర్రర్‌ కథనం ప్రకారం...  కొత్త బాండ్‌ చిత్రానికి డానీ బోయెల్‌ దర్శకత్వ బాధత్యలు చేపట్టనున్నాడు. ఈ క్రమంలో తన చిత్రంలో డేనియల్‌ క్రెయిగ్‌నే హీరోగా పెట్టాలని డానీ నిర్ణయించుకున్నాడంట. ఎలాగోలా క్రెయిగ్‌ను ఒప్పించిన దర్శకుడు.. ఈ డిసెంబర్‌ చివరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించాడు. కేవలం భారీ పారితోషకంతోనే టెంప్ట్‌ అయిన క్రెయిగ్‌​ ఈ చిత్రం కోసం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 50 మిలియన్‌ బ్రిటీష్‌ పౌండ్లు(భారత కరెన్సీ ప్రకారం రూ. 450 కోట్లు) రెమ్యునరేషన్‌ ఈ చిత్రం కోసం అతను తీసుకోబోతున్నాడు. క్రెయిగ్‌ క్రేజ్‌ కారణంగానే గత రెండు బాండ్‌ చిత్రాలు కలెక్షన్ల ప్రభంజనం సృష్టించాయి. అందుకే అతగాడికి ఇంత పెద్ద మొత్తం ముట్టజెప్పేందుకు మేకర్లు ముందుకొచ్చారంట.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో డేనియల్‌ మాట్లాడుతూ...‘బాండ్‌ చిత్రాలు చేయకూడదని నిర్ణయించుకున్నా. ఒకవేళ నేను ఇంకో చిత్రం చేయాల్సి వస్తే మాత్రం. అది కేవలం డబ్బు కోసమే’ అని స్పష్టం చేశాడు కూడా. బాండ్‌ ఫ్రాంచైజీలో ఇది 25వ చిత్రం కాగా, డేనియల్‌కు 5వ చిత్రం. వచ్చే ఏడాది నవంబర్‌లో సినిమా విడుదల కానుంది.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top