బిగ్‌ బి ఇంట్లో దీపావళి వేడుకలు, స్టార్స్‌ హంగామా

Amitabh Bachchan Host To This Diwali Bash At His Home After Two Years - Sakshi

అంగరంగ వైభవంగా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఉత్సహంగా జరుపుకునే పండగ దీపావళి. ఈ దీపావళికి మన సెలబ్రిటీల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బాలీవుడ్‌ సెలబ్రిటీలు చేసే సందడి అంతాఇంతా కాదు. సంప్రదాయ వస్త్రాధారణతో అందరు ఒకచోట చేరి పండగ హంగామ అంటే ఎంటో చూపిస్తారు. ఇక బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ఆదివారం ముంబైలోని తన నివాసం జల్సాలో దీపావళి వేడుకలను ఘనంగా జరిపారు. బాలీవుడ్‌ నటీనటులకు, దర్శకనిర్మాతలకు ఆయన అతిథ్యం ఇచ్చారు. రెండేళ్ల తర్వాత బిగ్‌ బి ప్రముఖులతో కలిసి అంగరంగ వైభంగా జరుపుకున్న ఈ దీపావళికి సెలబ్రిటీలంతా కుటుంబసమేతంగా హాజరయ్యారు. సం‍ప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న వారి ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

ఈ సందర్భంగా ప్రముఖ బిజినెస్‌ మ్యాన్‌, భారత కుబేరుడు ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీలతో పాటు షారుక్‌ఖాన్‌ అతని భార్య గౌరి ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌- ట్వింకిల్‌ కన్నా, అనుష్క శర్మ- విరాట్‌ కొహ్లీలతో పాటు మిగతా సెలబ్రేటిలంతా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. అలాగే టైగర్‌ ష్రాఫ్‌, కజోల్‌, కత్రీనా కైఫ్‌, జాక్వేలీన్‌ ఫెర్నాండేస్‌, వరుణ్‌ ధావన్‌, అర్జున్‌ రాంపాల్‌, బిపాషా బసు, నటశ దాలాల్‌, శ్రద్ధాకపూర్‌, శక్తి కపూర్‌, సార అలీ ఖాన్‌, కైరా అద్వానీ ఇబ్రాహ్మీం అలీ ఖాన్‌, ఈశా డియోల్‌, షనయా కపూర్‌లతో ప్రముఖ బాలీవుడ్‌ యాక్టర్స్‌ ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top