చంద్రునిపై కూలిపోయిన స్పేస్‌క్రాఫ్ట్‌

Israeli Spacecraft Crash While Attempt To Land On Moon - Sakshi

జెరుసలెం: ఇజ్రాయిల్‌కు చెందిన స్పేస్‌ క్రాఫ్ట్‌ చంద్రునిపై కూలిపోయింది. చంద్రునిపై స్పేస్‌క్రాఫ్ట్‌ను ల్యాండ్‌ చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయోల్‌ ‘స్మాల్‌ కంట్రీ బిగ్‌ డ్రీమ్స్‌’ పేరిట ఈ ప్రయోగాన్ని చేపట్టింది. గురువారం స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రునిపై ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది. దీంతో ఈ ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలను ఇజ్రాయిల్‌ టీవీతో పాటు సోషల్‌ మీడియాలో కూడా ప్రసారం చేశారు. అయితే చివరి నిమిషంలో ఈ ప్రయోగం విఫలమైంది. చంద్రునికి అత్యంత దగ్గరి కక్షలోకి వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్‌ మరికాసేట్లో ల్యాండ్‌ అవుతుందనగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో కూలిపోయింది.

దీనిపై ఇజ్రాయిల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ జీఎం ఓపెర్‌ డోరాన్ మాట్లాడుతూ.. తాము అనుకున్నట్టుగా ప్రయోగం విజయవంతం కాలేదని తెలిపారు. దీంతో నిరాశకు గురికావద్దని ఈ మిషన్‌ కోసం పనిచేసిన వారికి సూచించారు. అయినా ఇది ఒక్క గొప్ప విజయమేనని వ్యాఖ్యానించారు. కాగా, ఫ్లోరిడాలోని కేఫ్‌ కానవెరాల్‌ నుంచి ఫిబ్రవరి 21వ తేదీన ఇజ్రాయెల్‌కు చెందిన తొలి మూన్‌ లాండర్‌ను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. 585 కిలోల బరువున్న ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా పంపించారు. ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనాకు చెందిన స్పేస్‌క్రాఫ్టులు మాత్రమే చంద్రునిపై అడుగుపెట్టాయి. మొత్తంగా ఏడు దేశాలు చంద్రునిపై స్పేస్‌క్రాఫ్ట్‌ ల్యాండ్‌ చేయడానికి ప్రయత్నించగా మూడు మాత్రమే విజయం సాధించాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top