వావ్‌ వాట్‌ ఏ ఐఫోన్‌.. హెలికాప్టర్‌ నుంచి.. | Sakshi
Sakshi News home page

వావ్‌ వాట్‌ ఏ ఐఫోన్‌.. హెలికాప్టర్‌ నుంచి పడినా..

Published Thu, Oct 19 2017 1:45 PM

iPhone falls 500ft out of a helicopter - and survives

న్యూయార్క్‌ : ఐఫోన్‌ అంటేనే ఒక బ్రాండ్‌ అని విశ్వాసం. అది చేతిలో ఉంటే చాలు తమ స్టేటస్‌ను తెలుపుతుంది అని అనుకునే వాళ్లు చాలామంది. మార్కెట్‌లోకి ఎన్ని రకాల కంపెనీలకు చెందిన ఫోన్‌లు వచ్చినా ఒక్క ఐఫోన్‌ మీదనే మోజు ఉండటంలో ఏ మాత్రం తప్పులేదనిపించక తప్పదేమో ఈ వీడియో చూశాక. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 అడుగులో ఎత్తులో నుంచి పడిపోయినా ఐఫోన్‌ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా అంత ఎత్తు నుంచి కింద పడిన తర్వాత కూడా అది చాలా బాగా పనిచేసింది.

వివరాల్లోకి వెళితే.. హెలికాప్టర్‌లో 500 మీటర్ల ఎత్తులో నుంచి వెళుతున్న జాన్‌ అనే వ్యక్తి తన చుట్టు ఉన్న ప్రాంతాలను ఐఫోన్‌లో చిత్రీకరించడం మొదలుపెట్టాడు. అయితే, అనుకోకుండా ఆ ఫోన్‌ పడిపోయింది. దీంతో అప్పటికప్పుడు విమానాన్ని కిందికి దించి దాదాపు గంటపాటు వెతికిన తర్వాత అతడికి దొరికింది. 'గంట సమయం తర్వాత నా ఐఫోన్‌ నాకు దొరికింది. అప్పటికీ నా ఫోన్‌ వీడియోను రికార్డు చేస్తూనే ఉంది' అని జాన్‌ చెప్పాడు.

Advertisement
 
Advertisement