అమెరికాలో స్వామీజీపై దాడి | Hindu Priest Brutally Attacked Near Queens Temple | Sakshi
Sakshi News home page

అమెరికాలో స్వామీజీపై దాడి

Jul 21 2019 12:10 PM | Updated on Jul 21 2019 2:59 PM

Hindu Priest Brutally Attacked Near Queens Temple - Sakshi

అమెరికాలో విద్వేష దాడి

న్యూయార్క్‌: అమెరికాలోని గ్రీన్‌ఓక్స్‌ ప్రాంతంలో ఓ హిందూ పూజారిపై దాడి ఘటన కలకలం రేపింది. గ్లెన్‌ఓక్స్‌లోని శివ శక్తి పీఠం ప్రాంతంలో పీఠానికి చెందిన స్వామీజీ హరీష్‌ చందర్‌ పూరి నడుచుకుంటూ వెళుతుండగా, వెనుకనుంచి వచ్చిన ఓ వ్యక్తి స్వామీజీని దారుణంగా పలుమార్లు కొట్టి గాయపరిచాడు. స్వామీజీని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. హిందూ స్వామీజీపై దాడి ఘటనలో 52 సంవత్సరాల సెర్జియ గువెయను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

స్వామీజీపై దాడిని విద్వేష దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్వామీజీని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని ఆయన శిష్యులు కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఇది మా ప్రాంతం అని నినాదాలు చేసినట్టు చెబుతున్నారు. కాగా తనపై దాడికి దిగిన వ్యక్తి కోసం కూడా ప్రార్ధన చేస్తానని స్వామీజీ హరీష్‌ చందర్‌ చెప్పారు. కొన్నిసార్లు ప్రజలు నియంత్రణ కోల్పోయి వ్యవహరిస్తారని అన్నారు. గాయాల నుంచి తాను మెల్లగా కోలుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement