పచ్చని తీరం | Green coastal of zing davao beach | Sakshi
Sakshi News home page

పచ్చని తీరం

Jul 17 2016 3:13 AM | Updated on Aug 13 2018 3:30 PM

పచ్చని తీరం - Sakshi

పచ్చని తీరం

అలుపెరగని అలల నురగలతో సుందరంగా ఉండాల్సిన బీచ్ ఆకుపచ్చగా మారిపోయింది.

అలుపెరగని అలల నురగలతో సుందరంగా ఉండాల్సిన బీచ్ ఆకుపచ్చగా మారిపోయింది. తూర్పు చైనా జింగ్ డావో ప్రావిన్స్‌లోని ఓ బీచ్ నాచుమయంగా మారింది. అలలతో పాటు ఒడ్డుకు కొట్టుకొచ్చే నాచుతో ఆ ప్రాంతమంతా ఆకుపచ్చ రంగుతో నిండుకుని కంటికి ఇంపుగా కనిపిస్తోంది. సాధారణ నాచు అంటే దుర్వాసన వెదజల్లుతూ అటువైపు వెళ్లాలంటేనే చిరాకు కలిగిస్తుంది. కానీ ఈ ఫొటోలో కనిపిస్తున్న నాచు మాత్రం సువాసన వెదజల్లుతూ స్థానికులను ఆకర్షిస్తోంది.
 
 ఈ నాచు తీరాన్ని చూసేందుకు ప్రస్తుతం చైనీయులు ఎగబడుతున్నారు. మరీ ముఖ్యంగా వీకెండ్స్‌లో అమ్మాయిల తాకిడి ఎక్కువగా ఉంటోంది. పచ్చ సముద్రం (ఎల్లో సీ) నుంచి భారీగా కొట్టుకొచ్చే నాచు ఇప్పుడు దాదాపు 9 వేల హెక్టార్లు పేరుకుపోయిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. దీనిని శుభ్రం చేద్దామనుకునేలోగా పర్యాటకుల సంఖ్య పెరిగిందని దీంతో నాచు తొలగింపు పనులను నిలిపేసినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement